‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ స్టోరీ, మహేష్ క్యారెక్టర్!

సోమవారం, జూన్ 4, 2012, 12:43 [IST]

 

సూపర్ స్టార్ మహేష్ బాబువిక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

mahesh babu svsc movie story

ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ తాజాగా లీకైంది. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి…

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం స్టోరీ లైన్ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో రాముడు, లక్ష్మణుల పాత్రల్లా ఉంటాయి వెంకటేష్ మహేష్ బాబు పాత్రలు.

మల్లిఖార్జునరావు(వెంకటేష్), సీతారామరాజు(మహేష్ బాబు) అన్నదమ్ములు. వీరిది మధ్యతరగతి కుటుంబం. మల్లిఖార్జునరావు చాలా సాఫ్ట్ పర్సన్. తన మరదలు(అంజలి)ని పెళ్లి చేసుకుంటాడు. సీతారామారాజు స్ట్రైట్ పార్వడ్‌గా ఉండే వ్యక్తిత్వం. వైజాగ్‌లో ఎంబీఏ పూర్తి చేసిన సీతారామరాజు ఉద్యోగం కోసం తమ సొంత ప్రాంతానికి వస్తాడు.

కోటీశ్వరుడి(రావు రమేష్) కూతురైన సమంతను సీతారామరాజు ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఈ వివాహం సమయంలో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి విభేదాలు వస్తాయి. ఇది కాస్తా వారి తండ్రి మరణానికి దారి తీస్తుంది. అన్నదమ్ములు విడిపోతారు. ఆహుతి ప్రసాద్ ద్వారా మోసగించబడ్డ మల్లిఖార్జునరావు ఆస్తి విషయంలో గొడవ పడి గర్భవతిగా ఉన్న తన భార్యతో ఇంట్లో నుంచి వెళ్లి పోతాడు.

వాస్తవానికి సీతారామా రాజు వాళ్ల తల్లిదండ్రుల సొంత పుత్రుడు కాదు. ఫ్యామిలో ఏర్పడ్డ వివాదాలను సాల్వ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. సీతారామరాజకు బ్రహ్మానందం సహకరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సినిమా ఆసక్తిగా సాగుతూ సుఖాంతం అవుతుంది. అయితే స్టోరీ ఇదేనా కాదా? అనేది అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

Leave a comment